Saturday, 26 September 2026
  • Home  
  • ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా చేపట్టాలి:
- నిర్మల్

ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా చేపట్టాలి:

సెప్టెంబర్ 25, 2026 -నిర్మల్ పున్నమి ప్రతినిధి ఖరీఫ్ పంటల కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ రెవెన్యూ రాథోడ్ రమేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కలిసి ఖరీఫ్ (వానాకాలం) వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేస్తూ, పంట కొనుగోలును పకడ్బందీగా చేపట్టాలన్నారు. గతంలో క్షేత్రస్థాయిలో ఎదురైన అనుభవాల దృష్ట్యా తగిన ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి సమస్యలు కలగకుండా చూడాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని వివరించారు. వ్యవసాయ అధికారులు మండలాల వారీగా వివరాలు సేకరించి, తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కు సంబంధించి సామాగ్రి అంతా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, వ్యవసాయ అధికారి సుజాత, తూనికలు కొలతల అధికారి శంకర్, డిసిఓ నర్సయ్య, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 25, 2026 -నిర్మల్ పున్నమి ప్రతినిధి

ఖరీఫ్ పంటల కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ రెవెన్యూ రాథోడ్ రమేష్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కలిసి ఖరీఫ్ (వానాకాలం) వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేస్తూ, పంట కొనుగోలును పకడ్బందీగా చేపట్టాలన్నారు. గతంలో క్షేత్రస్థాయిలో ఎదురైన అనుభవాల దృష్ట్యా తగిన ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి సమస్యలు కలగకుండా చూడాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని వివరించారు. వ్యవసాయ అధికారులు మండలాల వారీగా వివరాలు సేకరించి, తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కు సంబంధించి సామాగ్రి అంతా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, వ్యవసాయ అధికారి సుజాత, తూనికలు కొలతల అధికారి శంకర్, డిసిఓ నర్సయ్య, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.