Monday, 28 September 2026
  • Home  
  • అక్టోబర్‌ 11 నుంచి టాస్‌ పరీక్షలు పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్‌ దివాకర్‌ టి.ఎస్.
- ఖమ్మం

అక్టోబర్‌ 11 నుంచి టాస్‌ పరీక్షలు పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్‌ దివాకర్‌ టి.ఎస్.

ఖమ్మం: టాస్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 11 నుంచి 17వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిక్కాబజార్‌ను పరీక్ష కేంద్రాలుగా గుర్తించారు. 10వ తరగతి పరీక్షలకు 537 మంది, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 411 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ దివాకర్‌ టి.ఎస్. అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్‌, వైద్య సదుపాయాలతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.