Thursday, 24 September 2026
  • Home  
  • ఉదయగిరి ఉప ఖజానా కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ఉప ఖజానా కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ

ఉదయగిరి ఉప ఖజానా కార్యాలయాన్ని జిల్లా ఖజానా అధికారి ఎం. లక్ష్మీదేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పెన్షన్ రికార్డులు, ఫైలీఫ్ రిజిస్టర్లను పరిశీలించి, రికార్డుల నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం కార్యాలయ భవనాన్ని పరిశీలించగా పలు చోట్ల పగుళ్లు ఉన్నట్లు గుర్తించారు. భవన పరిస్థితిపై వెంటనే కాంట్రాక్టర్, ఏఈతో మాట్లాడిన ఆమె, అవసరమైన మరమ్మతు పనులను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. భవన భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ తనిఖీలో ఎస్టీఓ ఎస్‌కే ఉస్మాన్ పాల్గొన్నారు. కార్యాలయ రికార్డులను ఎప్పటికప్పుడు క్రమబద్ధంగా నిర్వహించాలని సిబ్బందికి ఆమె సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.