అరకులోయ, సెప్టెంబర్ 30: కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అరకులోయ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్–16 లాంగ్‌జంప్‌లో డి.అశోక్, ఎం.ఆదిత్య, హైజంప్‌లో జి.కార్తీక్, జావెలిన్ త్రోలో జి.సురేష్, అండర్–14 ట్రయాథ్లాన్లో కె.చంద్రకాంత్ పాల్గొననున్నారు. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్ పి.ఎస్.ఎన్.మూర్తి, కోచ్ డి.కొండలస్వామి ఆకాంక్షించారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అరకులోయ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు