కోటితీర్థం…….
ఆత్మకూరు: కోటితీర్థంలో కోర్టు స్టే ఉన్న భూమిలోకి ప్రవేశించి జేసీబీతో వరి పైరును ధ్వంసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పద పొలాన్ని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. వైసీపీ చేజర్ల మండల సమీక్ష సమావేశానికి వెళ్తున్న ఆయన మార్గమధ్యలో బాధిత రైతులను కలిశారు. ఘటనకు సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటకు జరిగిన నష్టం, భూమి వివాదానికి దారితీసిన పరిస్థితులపై రైతులతో మాట్లాడారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ పొలంలోకి ప్రవేశించి పంటను ధ్వంసం చేశారన్న రైతుల ఆరోపణలను ఆయన విన్నారు. ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకుని రైతులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.


