సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటిస్తున్న మొదటి చిత్రం ” శ్రీనివాస మంగాపురం” జూలై 30 వ తేదీన విడుదల సందర్భంగా “హైదరాబాద్” లోని సారధి స్టూడియోస్ లో ఘట్టమనేని అభిమానుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హీరో జయకృష్ణ పాల్గొని తను నటించిన” శ్రీనివాస మంగాపురం” చిత్రాన్ని ఆదరించి, విజయవంతం చేయాలని అభిమానులను కోరారు.
అలాగే మును ముందు మరిన్ని మంచి చిత్రాలలో నటించుటకు అవకాశం మరియు మీ సహాయ సహకారాలు అవసరమని తెలియజేశారు.
ఈ సందర్భంగా తన తాతయ్య గారైన సూపర్ స్టార్ కృష్ణ గారిని తన తండ్రి రమేష్ బాబు ను గుర్తు చేసుకున్నారు.తన బాబాయ్ యూనివర్సల్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రోత్సహం,ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు.
నిర్వహించిన” ఘట్టమనేనిఅభిమానుల ఆత్మీయ సమావేశం”లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర హీరో కృష్ణ సీనియర్ అభిమాన సంఘo నాయకులు G.జితేంద్రకుమార్,D. రాంబాబు,MD.ఖాదర్ గోరి మరియు నరసరావుపేట కృష్ణ మహేష్ బాబు అభిమానుల సంఘం పట్టణ అధ్యక్షులు MD. ఫారూఖ్ బాబు, SK.అబ్దుల్ సలాం ,MD. పర్వేజ్ చిష్తి ,B. కొండలరావు, P.వెంకటరావు, G.కోటేశ్వరరావు, ఫోటో గ్రాఫర్ చిన్ని కృష్ణ,SK. నబీబాజీ తదితరులు పాల్గొన్నారు






