10వ తరగతి ఫలితాలలో 566 మార్కులతో టాపర్లుగా నిలిచిన దూపం చరణ్
పున్నమి: హయత్ నగర్ మండలం: పదవ తరగతి పరీక్ష ఫలితాలలో హయత్ నగర్ లోని కుంట్లూర్ తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి, విశేష ప్రతిభ కనబరిచారని, అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పాఠశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్ నిర్మల తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నరేంద్ర, నరసింహ, అన్నపూర్ణ, అనిత, నస్రీన్ బేగం విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి, పట్టుదల ఫలితమే ఈ విజయమని అన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు దూపం చరణ్ 566, పి. రాకేష్ 552, ఎం. కార్తిక్ 551, షేక్ రిజ్వాన్ 550, డేవిడ్ ఇమ్మాన్యుయేల్ 543, ఎండీ ముబీన్ 505, ఎం. సోఫియాన్ 504, కె. తనూజ్ 503 సాధించారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన్ మైనార్టీ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులకు ఉచిత అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ నిర్మల తెలిపారు.


