Thursday, 10 September 2026
  • Home  
  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్
- ఖమ్మం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్ పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు గార్లఒడ్డు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గార్లఒడ్డు గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో సర్పంచ్ భూక్య నర్సిలాలు నాయక్ దేవస్థాన నిర్వహణ అధికారి S V D ప్రసాద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ భూక్య నర్సిలాలు నాయక్ చేతుల మీదుగా దేవస్థానం పరిసరాల్లో పలు రకాల మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంపొందితే పర్యావరణ సమతుల్యతతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని తెలిపారు. గ్రామ ప్రజలు, యువత మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని సర్పంచ్ నర్సిలాలు నాయక్ కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు మాజీ ఎంపీటీసీ వారి శంకర్ ప్రసాద్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్ రావు రాథోడ్ దేవస్థాన పూజారి బిటుకూరి నాగరాజు దేవస్థాన నిర్వహణ అధికారి ఎస్ వి డి ప్రసాద్ గ్రామ పెద్దలు, స్థానికులు, దేవస్థాన సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు
గార్లఒడ్డు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గార్లఒడ్డు గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో సర్పంచ్ భూక్య నర్సిలాలు నాయక్ దేవస్థాన నిర్వహణ అధికారి S V D ప్రసాద్
ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ భూక్య నర్సిలాలు నాయక్ చేతుల మీదుగా దేవస్థానం పరిసరాల్లో పలు రకాల మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంపొందితే పర్యావరణ సమతుల్యతతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని తెలిపారు.
గ్రామ ప్రజలు, యువత మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని సర్పంచ్ నర్సిలాలు నాయక్ కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు మాజీ ఎంపీటీసీ వారి శంకర్ ప్రసాద్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్ రావు రాథోడ్ దేవస్థాన పూజారి
బిటుకూరి నాగరాజు దేవస్థాన నిర్వహణ అధికారి ఎస్ వి డి ప్రసాద్
గ్రామ పెద్దలు, స్థానికులు, దేవస్థాన సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.