Tuesday, 15 July 2025
  • Home  
  • స్వచ్ఛ ఉదయగిరి కోసం ట్రాక్టర్ల పంపిణీ గ్రామాలలో పారిశుద్ధ్యం పై కాకర్ల కన్ను.
- Featured - ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ ఉదయగిరి కోసం ట్రాక్టర్ల పంపిణీ గ్రామాలలో పారిశుద్ధ్యం పై కాకర్ల కన్ను.

. జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (మార్చి పున్నమి) స్వచ్ఛ ఉదయగిరి కోసం సమిష్టి గా కృషి చేయాలనే ఆలోచనను ఆచరణలో పెట్టే క్రమంలో అందుకు కావాల్సిన వనరులను యమ్ యల్ ఎ కాకర్ల సురేష్ సిద్ధం చేస్తున్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా, స్వచ్ఛ భారత్ నిధుల నుండి చాకలి కొండ కాటేపల్లి పంచాయతీలకు మంజూరైన రెండు ట్రాక్టర్లను కాకర్ల సురేష్ ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు కార్యదర్శులకు, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో శుక్రవారం పంపిణీ చేశారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్లను కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ దంపతులు ట్రాక్టర్ పైకి ఎక్కి నడిపి సర్పంచ్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యం మెరుగుకై సుమారు 12 లక్షల రూపాయల విలువ కలిగిన ట్రాక్టర్లను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. వీటిని వినియోగించుకొని గ్రామాలలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. టాక్టర్ల ద్వారా సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించి సంపద సృష్టించాలని తెలిపారు. ఇంతకాలం వాహనం లేని ఈ రెండు పంచాయతీలకు వాహనాలు రావడం పట్ల గ్రామ సర్పంచులు నాయకులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చాకలి కొండ సర్పంచ్ కుమారి ఉప్పి రెట్ల సుబ్బలక్ష్మి కుమారి డాక్టర్ వెంకటేశ్వర్లు పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య వింజమూరు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ కొండాపురం మాజీ జడ్పిటిసి సభ్యులు దామా మహేష్ టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష కాటేపల్లి సర్పంచ్ ముప్పూరి విజయ లక్ష్మమ్మ లెక్కల వెంగళరెడ్డి దిండు నారాయణ ఉప సర్పంచ్ నాగేంద్రబాబు కేశవ నారాయణ దిండు కిరణ్ దిండు వెంకటేష్ కార్యదర్శులు శేఖర్ షరీఫ్ తదితరులు ఉన్నారు.

.
జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (మార్చి పున్నమి)
స్వచ్ఛ ఉదయగిరి కోసం సమిష్టి గా కృషి చేయాలనే ఆలోచనను ఆచరణలో పెట్టే క్రమంలో అందుకు కావాల్సిన వనరులను యమ్ యల్ ఎ కాకర్ల సురేష్ సిద్ధం చేస్తున్నారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా, స్వచ్ఛ భారత్ నిధుల నుండి చాకలి కొండ కాటేపల్లి పంచాయతీలకు మంజూరైన రెండు ట్రాక్టర్లను కాకర్ల సురేష్ ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు కార్యదర్శులకు, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో శుక్రవారం పంపిణీ చేశారు.
ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్లను కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ దంపతులు ట్రాక్టర్ పైకి ఎక్కి నడిపి సర్పంచ్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యం మెరుగుకై సుమారు 12 లక్షల రూపాయల విలువ కలిగిన ట్రాక్టర్లను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. వీటిని వినియోగించుకొని గ్రామాలలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. టాక్టర్ల ద్వారా సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించి సంపద సృష్టించాలని తెలిపారు. ఇంతకాలం వాహనం లేని ఈ రెండు పంచాయతీలకు వాహనాలు రావడం పట్ల గ్రామ సర్పంచులు నాయకులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో చాకలి కొండ సర్పంచ్ కుమారి ఉప్పి రెట్ల సుబ్బలక్ష్మి కుమారి డాక్టర్ వెంకటేశ్వర్లు పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య వింజమూరు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ కొండాపురం మాజీ జడ్పిటిసి సభ్యులు దామా మహేష్ టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష కాటేపల్లి సర్పంచ్ ముప్పూరి విజయ లక్ష్మమ్మ లెక్కల వెంగళరెడ్డి దిండు నారాయణ ఉప సర్పంచ్ నాగేంద్రబాబు కేశవ నారాయణ దిండు కిరణ్ దిండు వెంకటేష్ కార్యదర్శులు శేఖర్ షరీఫ్ తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.