Wednesday, 9 September 2026
  • Home  
  • స్వచ్ఛతలో ప్రజల భాగస్వామ్యం అవసరం: ఎంపీ హరీష్ మాధుర్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వచ్ఛతలో ప్రజల భాగస్వామ్యం అవసరం: ఎంపీ హరీష్ మాధుర్

పరిశుభ్ర పట్టణమే లక్ష్యంగా కార్యాచరణ స్వచ్ఛతపై ప్రజలకు అధికారుల పిలుపు అమలాపురం, పున్నమి దినపత్రిక: స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం కల్వకొలను వీధి స్వర్ణ వార్డు వద్ద “క్లీన్ సిటీస్-గ్రీన్ కమ్యూనిటీస్” ఇతివృత్తంతో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి మున్సిపల్ పారిశుధ్య వాహనాలకు అందించాలని సూచించారు. కాలువలు, రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులను మరింత సమర్థంగా శుభ్రం చేసేందుకు త్వరలో స్వీపింగ్ మిషన్ మంజూరు చేస్తానని తెలిపారు.మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు త్వరలో వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లను ఏర్పాటు చేసి, వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణ పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ మాట్లాడుతూ కాలువలు, రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా వ్యర్థాలు పడవేసే వారిని గుర్తించి పర్యావరణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మున్సిపాలిటీకి పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్వో కె. సుబ్బారావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మెట్ల రమణబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్లు చిక్కాల గణేష్, పెచ్చెట్టి విజయలక్ష్మి, కర్రి దత్తుడు, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, స్వర్ణ వార్డు కార్యదర్శులు, మెప్మా సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

పరిశుభ్ర పట్టణమే లక్ష్యంగా కార్యాచరణ

స్వచ్ఛతపై ప్రజలకు అధికారుల పిలుపు

అమలాపురం, పున్నమి దినపత్రిక: స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం కల్వకొలను వీధి స్వర్ణ వార్డు వద్ద “క్లీన్ సిటీస్-గ్రీన్ కమ్యూనిటీస్” ఇతివృత్తంతో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి మున్సిపల్ పారిశుధ్య వాహనాలకు అందించాలని సూచించారు. కాలువలు, రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులను మరింత సమర్థంగా శుభ్రం చేసేందుకు త్వరలో స్వీపింగ్ మిషన్ మంజూరు చేస్తానని తెలిపారు.మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు త్వరలో వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లను ఏర్పాటు చేసి, వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణ పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ మాట్లాడుతూ కాలువలు, రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా వ్యర్థాలు పడవేసే వారిని గుర్తించి పర్యావరణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మున్సిపాలిటీకి పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్వో కె. సుబ్బారావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మెట్ల రమణబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్లు చిక్కాల గణేష్, పెచ్చెట్టి విజయలక్ష్మి, కర్రి దత్తుడు, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, స్వర్ణ వార్డు కార్యదర్శులు, మెప్మా సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.