నెల్లూరు 09.05.2020 పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ✍️
నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో వ్యాపారాలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. స్టోన్ హౌస్ పేట మినహా మిగిలిన ప్రాంతంలోని దుకాణాలలో కోనుగోలులకు ఉదయం 6గం.ల నుండి 9గం.ల వరకు అనుమతి ఉందని స్పష్టం చేశారు.ప్రజలు అర్థం చేసుకుని,సహకరించాలని ఆయన కోరారు.కరోనా వైరస్ నియంత్రణ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.