Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మేధావులతో సంగోష్టి విజయవంతం :సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మేధావులతో సంగోష్టి విజయవంతం :సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గం “మేధావులతో సంగోష్టి” ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం! అరాచక శక్తులను తరిమికొడదాం!! అనే శీర్షికన నియోజకవర్గస్థాయి జాతీయవాదుల మేధోసంకుష్టి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి అధ్యక్షతన జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈరోజు ప్రపంచంలోనే దేశాలన్నీ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను కొనియాడుతుంటే దేశం లోపలే ఉన్న కొందరు ప్రతిపక్ష నాయకులు విద్రోహశక్తులతో చేతులు కలిపి దేశాన్ని అశాంతి, అభద్రతలతో విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారన్నారు, అయినా దేశ ప్రజలు సర్వతో ముఖాభివృద్ధిగా సాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బలమైన దేశంగా ఏర్పడటానికి ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉన్నారన్నారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియ అనేది ఈరోజు నరేంద్ర మోడీ తీసుకువచ్చిన అంశం కాదు అని రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టంగా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియను ముందుకు తీసుకువచ్చారన్నారు. చంద్రయాన్ , కరోనా కి వ్యాక్సిన్ , వందే భారత్ నూతన విద్య వైద్య విధానాలు విశ్వవిద్యాలయాలు విమానాశ్రయాలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధికి మైలురాళ్లుగా నిలుస్తాయి అన్నారు. చరిత్రను వక్రీకరించి ప్రజలను మోసం చేస్తూ యువతను తప్పుదారి పట్టించే కాంగ్రెస్ చేష్టలు జాతి వ్యతిరేకత దేశానికి ముప్పు కారణాలుగా మారుతున్నాయి అన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించిన తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ తన పెట్టుబడిదారి వ్యవస్థలను సంతృప్తి పరిచేందుకు దేశంలో ఎలాంటి అరాచకాలైన పాల్పడడానికి వెనకాడదని ప్రజలు గుర్తించి సరైన బుద్ధి చెప్పారన్నారు. కార్యక్రమంలో భాగంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్, చిలుక విజయరావు, ప్రముఖ డాక్టర్ అంబటి హేమంత్ రాజ్ , వ్యాపారవేత్త జొన్నల రాజేశ్వరరావు, పాలకుర్తి సోమశేఖర్, బల్ల శ్రీనివాస్, గౌడ సంఘం నాయకులు గడ్డం రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడి వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కావటి ముత్యాలు, సాంస్కృతిక సెల్ జిల్లా అధ్యక్షులు చెరుకు పాపయ్య , డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ పెరుమాండ్ల అమరేందర్ రెడ్డి, చిల్పూర్ మండల అధ్యక్షులు గంటే ఉపేందర్ యాదవ్, ధర్మసాగర్ మండల అధ్యక్షులు బైరపాక కుమార్, రిటైర్డ్ డి ఈ దుర్గాప్రసాద్, మేధావులు జాతీయవాదులు ప్రజాసంఘాల నాయకులు వివిధ కుల సంఘాల పెద్ద మనుషులు పాల్గొన్నారు.

స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మేధావులతో సంగోష్టి విజయవంతం :సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మేధావులతో సంగోష్టి విజయవంతం :సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మేధావులతో సంగోష్టి విజయవంతం :సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మేధావులతో సంగోష్టి విజయవంతం :సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *