Story highlights
- *వెట్టిచాకిరీపై అవగాహన ప్రచారానికి ‘స్వేచ్ఛా రథం’ ప్రారంభం* *బాధితులను గుర్తించి, రక్షించి, పునరావాసం కల్పించాలి* ----జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* వెట్టిచాకిరీ నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అన్నారు.
- జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వెట్టిచాకిరీపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ‘స్వేచ్ఛా రథం’ ను *కలెక్టర్* పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
- ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ..
*వెట్టిచాకిరీపై అవగాహన ప్రచారానికి ‘స్వేచ్ఛా రథం’ ప్రారంభం*
*బాధితులను గుర్తించి, రక్షించి, పునరావాసం కల్పించాలి*
—-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
వెట్టిచాకిరీ నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అన్నారు.
జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వెట్టిచాకిరీపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ‘స్వేచ్ఛా రథం’ ను *కలెక్టర్* పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. వెట్టిచాకిరీపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, బాండెడ్ లేబర్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 080-69434343 గురించి విస్తృతంగా ప్రచారం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ ప్రచార వాహనం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వ్యవసాయం, ఇటుక బట్టీలు, జలవనరుల పెంపకం, గనులు, క్వారీలతో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వారి హక్కులు, వెట్టిచాకిరీ గుర్తింపు, ఫిర్యాదు విధానాలపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు.
వెట్టిచాకిరీ ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు అధికారులు తక్షణమే స్పందించి, బాధితులకు రక్షణ, పునరావాసం, అవసరమైన సహాయం అందించాలని స్పష్టం చేశారు.
ప్రజలకు బాండెడ్ లేబర్ హెల్ప్‌లైన్ గురించి విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా అనుమానిత వెట్టిచాకిరీ ఘటనలను నివేదించేందుకు, బాధిత కార్మికులను వారికి అందుబాటులో ఉన్న రక్షణ, సహాయ వ్యవస్థలతో అనుసంధానించేందుకు ‘స్వేచ్ఛా రథం’ ప్రచారం దోహదపడుతుందని వెల్లడించారు.
అదే విధంగా బాండెడ్ లేబర్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారి కుమారస్వామి, డీఎంహెచ్ఓ వాణి శ్రీ, స్కోప్ ఎన్జీఓ జీ. మనోజ్ కుమార్, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.