ఆసిఫాబాద్, అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి): కుమురంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం సేవాసేతు అభియాన్‌లో భాగంగా పీఎం సూర్య ఘర్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె. హరిత ముఖ్య అతిథిగా హాజరై ఎస్‌ఈ ఆపరేషన్ ఉత్తమ్ జాడేతో కలిసి పథకానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. రూఫ్‌టాప్ సోలార్‌తో విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చని, పర్యావరణహిత ఇంధన వినియోగాన్ని పెంచవచ్చని కలెక్టర్ వివరించారు. దరఖాస్తుకు విద్యుత్ బిల్లు, బ్యాంకు ఖాతా వివరాలు అవసరమని, అర్హులకు బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, సోలార్ వెండర్లు పాల్గొన్నారు.

సేవాసేతు అభియాన్‌లో పీఎం సూర్య ఘర్‌పై అవగాహన