అక్కంపేట – సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ల మధ్య కొండూరు సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.
మృతుడు సుమారు 30-35 ఏళ్ల వయస్సు కలిగి, నీలం రంగు జీన్స్ ప్యాంటు, షర్టు ధరించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి GRP పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


