సూళ్లూరుపేట- పోలిరెడ్డిపాలెం రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి ఒక గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి వయసు సుమారు 50 నుండి 55 ఏళ్ల మధ్య ఉండవచ్చు. ఆమె చామనఛాయ రంగు, నల్లటి జుట్టు కలిగి ఉంది. ప్రమాద సమయంలో ఆమె తెలుపు, నీలం, పింక్ రంగుల పూల డిజైన్ ఉన్న చీర, తెలుపు రంగు జాకెట్, మరియు పసుపు రంగు లంగా ధరించి ఉంది.ఈ ఘటనపై గూడూరు RPS పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి మృతదేహాన్ని గుర్తింపు కోసం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాల్సిందిగా కోరారు.

సూళ్లూరుపేటలో రైలు కింద పడి గుర్తుతెలియని మహిళ మృతి*