నెల్లూరు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది టీ.వి. రావు మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. సౌమ్యుడిగా, సహచర న్యాయవాదులతో ఆత్మీయంగా మెలిగే వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ) నెల్లూరు జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. టీ.వి. రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కమిటీ సభ్యులు ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ న్యాయవాదులు ఘనంగా నివాళులర్పించారు.

సీనియర్ న్యాయవాది టీ.వి. రావు కన్నుమూత