కేంద్రమైన సిద్ధవటం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ మండల ఎస్సై శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసు సిబ్బంది, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఇన్చార్జి ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ..ఎందరో మహానీయులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని, ముఖ్యంగా నిరుపేదలు, బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల అంకితభావంతో వ్యవహరించి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసులను సంప్రదించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యతతో పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని మరింత పెంచాలని పేర్కొన్నారు.
అనంతరం పచ్చదనాన్ని పెంపొందించేందుకు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలను సంరక్షించి వాటి పెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్బరామచంద్రతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



