Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

సమస్యలు పరిష్కరించే వరకు లైసెన్స్ సర్వేయర్ల విధుల బహిష్కరణ కొనసాగింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సమస్యలు పరిష్కరించే వరకు లైసెన్స్ సర్వేయర్ల విధుల బహిష్కరణ కొనసాగింపు

వార్త ముఖ్యాంశాలు

  • సమస్యలు పరిష్కరించే వరకు లైసెన్స్ సర్వేయర్ల విధుల బహిష్కరణ కొనసాగింపు పెండింగ్ బిల్లులు, నిధులు తక్షణమే విడుదల చేయాలి – జీవిత బీమా, ఆరోగ్య కార్డులు కల్పించాలి మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని మండలాల పరిధిలో పనిచేస్తున్న లైసెన్స్ సర్వేయర్లు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని…
  • ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా లైసెన్స్ సర్వేయర్లు విధుల బహిష్కరణ చేపట్టారు.
  • తమ సమస్యలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీతో పాటు పరిష్కారం లభించే వరకు విధుల్లోకి తిరిగి చేరేది లేదని వారు తేల్చిచెప్పారు.

సమస్యలు పరిష్కరించే వరకు లైసెన్స్ సర్వేయర్ల విధుల బహిష్కరణ కొనసాగింపు

పెండింగ్ బిల్లులు, నిధులు తక్షణమే విడుదల చేయాలి – జీవిత బీమా, ఆరోగ్య కార్డులు కల్పించాలి

మహబూబాబాద్:

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని మండలాల పరిధిలో పనిచేస్తున్న లైసెన్స్ సర్వేయర్లు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రీసర్వే విధులను మూకుమ్మడిగా బహిష్కరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా లైసెన్స్ సర్వేయర్లు విధుల బహిష్కరణ చేపట్టారు. తమ సమస్యలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీతో పాటు పరిష్కారం లభించే వరకు విధుల్లోకి తిరిగి చేరేది లేదని వారు తేల్చిచెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న లైసెన్స్ సర్వేయర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాము ఇప్పటివరకు నిర్వహించిన సర్వే పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు. నెలల తరబడి కష్టపడి విధులు నిర్వహిస్తున్నప్పటికీ చేసిన పనికి సంబంధించిన నిధులు అందకపోవడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే లైసెన్స్ సర్వేయర్లకు తగిన గౌరవ వేతనం కల్పించాలని, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా జీవిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి లైసెన్స్ సర్వేయర్‌కు ఆరోగ్య భద్రత కల్పించేలా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ఇతర న్యాయమైన సమస్యలను కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు.

రీసర్వే కార్యక్రమం విజయవంతం కావడంలో లైసెన్స్ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలను ప్రభుత్వం గుర్తించి తగిన గౌరవం, భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్ నిధులు విడుదల చేయడంతో పాటు అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

ప్రభుత్వం సంబంధిత అధికారులతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయం తీసుకొని లైసెన్స్ సర్వేయర్లకు న్యాయం చేయాలని, వారి సమస్యలను పరిష్కరించి తిరిగి రీసర్వే విధుల్లో చేరేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో విధుల బహిష్కరణ కొనసాగుతుందని లైసెన్స్ సర్వేయర్లు స్పష్టం చేశారు.

పున్నమి రిపోర్టర్ – భూక్య రాము నాయక్
మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *