డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి,సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగి ప్రభుత్వ విజయాలను ప్రతి ఇంటికి చేర్చాలని పిలుపునిచ్చారు.ప్రతినెలా ఒక ఎమ్మెల్యే నివాసంలో నిర్వహిస్తున్న సమన్వయ సమావేశం మంగళవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వగృహంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాట పట్టిందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. పరిశ్రమలు రాష్ట్రాన్ని వీడిపోయాయని, యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారని, రైతులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.విధ్వంసం చేయటం సులువని, అభివృద్ధి చేయడానికి ఎంతో దూరదృష్టి కావాలని మంత్రి అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, ఉపాధి కల్పన వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం, మెగా పీటీఎం, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. సోషల్ మీడియా, ఇంటింటి ప్రచారం, గ్రామస్థాయి సమావేశాల ద్వారా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.జగన్ పాలనలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, కోనసీమ జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రహదారులు, విద్యా సంస్థలు, వైద్య సేవలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ఈ సమావేశంలో శాసనసభ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు, అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు టిడిపి ఇన్చార్జి గొల్లపల్లి అమూల్య, తెదేపా సీనియర్ నాయకులు, పి.గన్నవరం నియోజకవర్గ టూ-మెన్ కమిటీ సభ్యులు మోకా ఆనంద్ సాగర్, డి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సమన్వయంతో ముందుకు సాగుదాం… ప్రభుత్వ విజయాలను ప్రతి ఇంటికి తీసుకెళ్దాం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్