Wednesday, 22 July 2026
  • Home  
  • సగం బ్రిడ్జి పూర్తి చేసి మిగతా సగం ఎందుకు ఆపేశారు? – ఎమ్మెల్యే మాధవి రెడ్డి సమాధానం చెప్పాలి: సయ్యద్ గౌస్ పీర్
- E-పేపర్

సగం బ్రిడ్జి పూర్తి చేసి మిగతా సగం ఎందుకు ఆపేశారు? – ఎమ్మెల్యే మాధవి రెడ్డి సమాధానం చెప్పాలి: సయ్యద్ గౌస్ పీర్

ప్రెస్ నోట్ తేదీ: 19-07-2026 సగం బ్రిడ్జి పూర్తి చేసి మిగతా సగం ఎందుకు ఆపేశారు? – ఎమ్మెల్యే మాధవి రెడ్డి సమాధానం చెప్పాలి: సయ్యద్ గౌస్ పీర్ కడప నగరంలోని ఎర్రముక్కపల్లి–బకరాపేట రహదారిపై నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జిని కాంగ్రెస్ నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండున్నర సంవత్సరాలు గడిచినా బ్రిడ్జిలో సగం మాత్రమే పూర్తై, మిగతా సగం పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం దారుణమన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. హాస్పిటల్‌కు వెళ్లే రోగులు, అంబులెన్స్‌లు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో, కేంద్రంలో, కడపలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. “సగం బ్రిడ్జిని ఇప్పుడు చూపించి, మిగతా సగాన్ని స్థానిక ఎన్నికల హామాగా వాడుకోవాలనుకుంటున్నారా? ప్రజలకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి సమాధానం చెప్పాలి” అని సయ్యద్ గౌస్ పీర్ ప్రశ్నించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే పనులు ప్రారంభించి, బ్రిడ్జిని పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు అంజన్ కుమార్ తోపాటు డివిజన్ ఇంచార్జ్ సర్దార్, ఖాజాపీర్,సయ్యద్ అన్వర్, మహబూబ్ భాషా, మురాద్, సుబ్రహ్మణ్యం, నాసిర్ ఖాన్ తదితర కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రెస్ నోట్
తేదీ: 19-07-2026

సగం బ్రిడ్జి పూర్తి చేసి మిగతా సగం ఎందుకు ఆపేశారు? – ఎమ్మెల్యే మాధవి రెడ్డి సమాధానం చెప్పాలి: సయ్యద్ గౌస్ పీర్

కడప నగరంలోని ఎర్రముక్కపల్లి–బకరాపేట రహదారిపై నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జిని కాంగ్రెస్ నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండున్నర సంవత్సరాలు గడిచినా బ్రిడ్జిలో సగం మాత్రమే పూర్తై, మిగతా సగం పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం దారుణమన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.

హాస్పిటల్‌కు వెళ్లే రోగులు, అంబులెన్స్‌లు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో, కేంద్రంలో, కడపలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

“సగం బ్రిడ్జిని ఇప్పుడు చూపించి, మిగతా సగాన్ని స్థానిక ఎన్నికల హామాగా వాడుకోవాలనుకుంటున్నారా? ప్రజలకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి సమాధానం చెప్పాలి” అని సయ్యద్ గౌస్ పీర్ ప్రశ్నించారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే పనులు ప్రారంభించి, బ్రిడ్జిని పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు అంజన్ కుమార్ తోపాటు డివిజన్ ఇంచార్జ్ సర్దార్, ఖాజాపీర్,సయ్యద్ అన్వర్, మహబూబ్ భాషా, మురాద్, సుబ్రహ్మణ్యం, నాసిర్ ఖాన్ తదితర కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.