విజయవాడలో కొలువు దీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని గురువారం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాజంపేట టీడీపీ నాయకులు శ్రీ మేడా విజయ శేఖర్ రెడ్డి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు మరియు వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట లేబక గ్రామ సర్పంచ్ లంకయ్య గారి వెంకట నరసయ్య, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి మనోహర్ నాయక్, ఆడుపూర్ గురుకుల పాఠశాల చైర్మన్ ఇరువురి మురళి, దళిత నాయకుడు సాతపల్లి వెంకి తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.


