చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ (సి.హెచ్.ఎస్.) ఆధ్వర్యంలో సభ్యుల కుటుంబాలకు ఆపద సమయంలో అండగా నిలిచే ఇన్సూరెన్స్ పద్ధతిలో భాగంగా ఇటీవల మృతి చెందిన సాయి కళాశాల వ్యవస్థాపకులు నూకా శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, విద్యార్థులు, స్నేహితులు విషాదంలో మునిగారు. ఈ నేపథ్యంలో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు సి.హెచ్.ఎస్. ముందుకు వచ్చింది. సంస్థ ప్రతినిధులు మన్నూరు భాస్కర్ రెడ్డి, గాడి ఇంతియాజ్ అహ్మద్, పులపుత్తూరు సురేష్ నాథ్, బొంతల శివ నాగేశ్వరరావు, గాల శివారెడ్డి, రోళ్ళ మోహన్ రాయల్, విశ్రాంత ఉపాధ్యాయుడు రంగారెడ్డి తదితరులు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సభ్యత్వం అంటే కేవలం సంస్థలో భాగం కావడం కాకుండా ఆపద సమయంలో ఒక కుటుంబానికి మరో కుటుంబం అండగా నిలవడమేనని పేర్కొన్నారు.

శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం