శ్రీ కాళహస్తి, ఆగస్టు 25, (పున్నమి న్యూస్): తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) చైర్మన్ శ్రీధర్ వర్మ మంగళవారం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు టెంపుల్ ఇన్‌స్పెక్టర్ హరిబాబు, ఏపీఆర్ఓ రవి పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం దక్షిణ గాలిగోపురం గుండా ప్రవేశించిన ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీధర్ వర్మ రాహు-కేతు పూజా మందిరం, గురు దక్షిణామూర్తి, మరియు మృత్యుంజయ స్వామి సన్నిధులను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో అధికారులు ఆయనకు స్వామి అమ్మవార్ల పవిత్ర తీర్థప్రసాదాలను, శేషవస్త్రాన్ని, మరియు దివ్య చిత్రపటాన్ని గౌరవపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ.. ముక్కంటి స్వామి, అమ్మవార్ల అపార అనుగ్రహంతోనే తనకు ఎస్వీబీసీ చైర్మన్‌గా సేవలు అందించే భాగ్యం కలిగిందని కొనియాడారు. భక్తి ఛానల్ ద్వారా ధార్మిక కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట విశాఖపట్నంకు చెందిన ప్రవీణ్, హైదరాబాద్‌కు చెందిన విక్రమ్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వరుని సేవలో ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ