శ్రీ కాళహస్తి, ఆగస్టు 31, (పున్నమి న్యూస్): దుబాయ్‌కి చెందిన ప్రముఖ భారతీయ బిలియనీర్, ఆర్‌పీ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ బి. రవి పిళ్లై తన కుటుంబంతో కలసి తిరుమల శ్రీవారు, శ్రీకాళహస్తి శ్రీజ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి వార్ల దర్శనార్థం విచ్చేయగా రేణిగుంటలోని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆధ్యాత్మిక పర్యటన నిమిత్తం తన కుమారుడు గణేష్ పిళ్లైతో కలసి విమానాశ్రయానికి చేరుకున్న రవి పిళ్లైకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఆత్మీయంగా సత్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన పారిశ్రామికవేత్త పుణ్యక్షేత్రాల దర్శనార్థం రావడం సంతోషకరమని పేర్కొన్న నేతలు, విమానాశ్రయ విరామ గదిలో నియోజకవర్గ పరిధిలోని పలు పారిశ్రామిక, ఆధ్యాత్మిక అభివృద్ధి అంశాలపై ఆయనతో ఆత్మీయంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పట్టణ పురప్రముఖులు, మాజీ ఎంపీటీసీ వల్లంశెట్టి ధర్మరాజు, వల్లంశెట్టి గోపాలకృష్ణ, శీనుతో పాటు బీజేపీ నాయకులు కూరకాల్వ వేణు ముదిరాజ్, నరేష్ రాయల్, రాజా రాయల్, రమణ రాయల్, ‘జనం కోసం’ వేణు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాగత సత్కారాలు అందించారు.

శ్రీకాళహస్తి, తిరుమల దర్శనార్థం విచ్చేసిన పారిశ్రామికవేత్తకి ఘన స్వాగతం పలికిన కోలా ఆనంద్