Saturday, 16 May 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో వైభవంగా స్వామి, అమ్మవార్ల అమావాస్య ఉత్సవం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో వైభవంగా స్వామి, అమ్మవార్ల అమావాస్య ఉత్సవం

శ్రీ కాళహస్తి, మే 16 (పున్నమి టెంపుల్ న్యూస్): ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం స్వామి, అమ్మవార్ల అమావాస్య ఉత్సవాన్ని అర్చకులు, అధికారులు శాస్త్రోక్తంగా, అత్యంత వైభవంగా నిర్వహించారు. అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవంలో భాగంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హారతులు సమర్పించారు. ఈ వేడుకను కళ్లారా వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి (ఈఓ) బి.కె. వెంకటేశ్వర్లు, సహాయ కార్యనిర్వహణాధికారి (ఏఈఓ) కృష్ణారెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు, వేద పండితులు, దేవస్థాన సిబ్బందితో పాటు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.