Thursday, 30 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో రూ.27.30 కోట్ల తాగునీటి అభివృద్ధి పనులకు శ్రీకారం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో రూ.27.30 కోట్ల తాగునీటి అభివృద్ధి పనులకు శ్రీకారం

శ్రీ కాళహస్తి, జులై 29, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, పారిశుద్ధ్య సౌకర్యాల కల్పన లక్ష్యంగా చేపడుతున్న రూ.27.30 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బుధవారం పానగల్ ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. తిరుపతి పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో, హైదరాబాద్‌కు చెందిన మెగా కన్స్ట్రక్షన్స్ సంస్థ పర్యవేక్షణలో ఈ పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు కింద మిట్టకండ్రిగ, ఎస్డీకే నగర్ ప్రాంతాల్లో 200 కిలోలీటర్ల సామర్థ్యం గల రెండు ఎత్తైన నీటి నిల్వ ట్యాంకులు (ఈఎల్‌ఎస్‌ఆర్‌లు) నిర్మించనున్నారు. అలాగే శిథిలావస్థకు చేరుకున్న పాత పైప్‌లైన్ల స్థానంలో ఆధునిక డీఐ-కే9 పైప్‌లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, రాజీవ్ నగర్ ప్రధాన రహదారిలో హెచ్‌డీపీఈ పైప్‌లైన్‌ను పునరుద్ధరించనున్నారు. మొత్తం 9.01 కిలోమీటర్ల పంపింగ్ మెయిన్, 22.09 కిలోమీటర్ల పంపిణీ పైప్‌లైన్ వ్యవస్థను విస్తరించి, అదనంగా 3,000 గృహాలకు కొత్త తాగునీటి కనెక్షన్లు కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తు జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును రూపొందించామని తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం పట్టణంలో నీటి వృథా గణనీయంగా తగ్గడంతో పాటు అన్ని ప్రాంతాలకు తగిన ఒత్తిడితో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ కె.వి. కృష్ణారెడ్డి, పబ్లిక్ హెల్త్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. సందీప్, మున్సిపల్ ఇంజనీర్ రవి ప్రకాష్, అసిస్టెంట్ ఇంజనీర్లు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.