వార్త ముఖ్యాంశాలు
- --రెండేళ్ల పదవీకాలం పూర్తి – ఎన్నికల కోడ్‌తో కొత్త పాలకమండలి ఏర్పాటులో జాప్యం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి రెండేళ్ల పదవీకాలం శనివారంతో ముగియనుంది.
- రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ 1న బీఆర్ నాయుడిని చైర్మన్‌గా నియమిస్తూ పాలకమండలిని ఏర్పాటు చేసింది.
- నవంబర్ 6న ఆయన బాధ్యతలు స్వీకరించారు.
–రెండేళ్ల పదవీకాలం పూర్తి – ఎన్నికల కోడ్‌తో కొత్త పాలకమండలి ఏర్పాటులో జాప్యం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి రెండేళ్ల పదవీకాలం శనివారంతో ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ 1న బీఆర్ నాయుడిని చైర్మన్‌గా నియమిస్తూ పాలకమండలిని ఏర్పాటు చేసింది. నవంబర్ 6న ఆయన బాధ్యతలు స్వీకరించారు. దేవదాయ చట్టం ప్రకారం 2026 అక్టోబర్ 31తో పాలకమండలి పదవీకాలం పూర్తవుతుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో నూతన పాలకమండలి నియామకం ఆలస్యమయ్యే అవకాశముంది. ఎన్నికల అనంతరం కొత్త బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అప్పటివరకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసే అంశంపైనా చర్చ జరుగుతోంది
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్