Monday, 4 May 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో మే 7న డీమ్డ్ యూనివర్సిటీ తరఫున స్పాట్ అడ్మిషన్లు
- తిరుపతి

శ్రీకాళహస్తిలో మే 7న డీమ్డ్ యూనివర్సిటీ తరఫున స్పాట్ అడ్మిషన్లు

శ్రీకాళహస్తి, మే 04 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అరుదైన అవకాశం లభిస్తోంది. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నడిచే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి డీమ్డ్ యూనివర్సిటీ తరఫున మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్థానిక బ్రాహ్మణ సమాజ కమ్యూనిటీ హాల్‌లో స్పాట్ అడ్మిషన్ల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా డిగ్రీ కోర్సుల్లో, అలాగే డిగ్రీ పూర్తి చేసిన వారికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, డీన్లు, ప్రొఫెసర్లు స్వయంగా పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేయనున్నారు. పట్టణం మరియు పరిసర గ్రామాల విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి బ్రాహ్మణ సమాజం అధ్యక్షుడు సింగరాజు ప్రకాశం పిలుపునిచ్చారు. మరిన్ని వివరాల కోసం 8106596773, 9885261974, 9949164010, 7702602497 నంబర్లను సంప్రదించవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.