శ్రీ కాళహస్తి, ఆగస్టు 08, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLA 2) నూతన ఓటర్ల జాబితాలను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల సౌకర్యార్థం నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌ల సంఖ్యను 294 నుంచి 319కి పెంచినట్లు వెల్లడించారు. ‘సార్’ (SIR) రెండో దశ కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులతో (BLO) కలిసి అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, అనర్హుల తొలగింపు, తప్పుల సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ కార్యకర్త బాధ్యతగా అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో-కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, మండల అధ్యక్షులు వేడం కృష్ణయ్య, భాగితి వెంకటేష్, నరేష్, కిషన్ మోర్చా ప్రతినిధి కుప్ప ప్రసాద్, మహిళా మోర్చా నాయకురాళ్లు ప్రజ్ఞా శ్రీ, రామ్ ఉమా సింగ్, సీనియర్ నాయకులు సొట్ట సుకుమార్, జీవి అమర్నాథ్, కన్నా వెంకటేశ్వర్లు, నాగలాపురం గోవర్ధన్, పుణ్యం ఢిల్లీకుమార్ రెడ్డి, మద్దు వాసుయాదవ్, పుచ్చకాయల రమేష్ యాదవ్, ఇమ్మిడిశెట్టి మోహన్, ఫ్లెక్సీ కృష్ణారెడ్డి, తానికొండ్ల భరత్ నాయుడు, నిడిగింటి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో పోలింగ్ బూత్‌ల సంఖ్య 319కి పెంపు-నూతన ఓటర్ల జాబితా పంపిణీ