Sunday, 2 August 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ దినోత్సవం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ దినోత్సవం

శ్రీ కాళహస్తి, ఆగస్టు 01, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కర్‌పేట, బాబుగ్రహారం మునిసిపల్ ఉన్నత పాఠశాలలతో పాటు తొండమనాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు ప్రత్యేక స్కార్ఫ్‌లు ధరించి సేవాభావం, క్రమశిక్షణ, సోదరభావానికి ప్రతీకగా నిలిచే స్కౌటింగ్ స్ఫూర్తిని చాటిచెప్పారు. భాస్కర్‌పేట మునిసిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమానికి జిల్లా కార్యాలయ కమిషనర్ టి. రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1907 ఆగస్టు నెలలో బ్రౌన్‌సీ ద్వీపంలో నిర్వహించిన తొలి స్కౌట్ శిబిరం జ్ఞాపకార్థంగా ప్రతి ఏడాది ఆగస్టు 1న ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా స్కౌట్స్, గైడ్స్ స్కార్ఫ్‌ను ధరించడం ద్వారా సమాజంలో సేవా తత్పరత, క్రమశిక్షణ, ఐక్యత, సోదరభావం వంటి విలువలను వ్యాప్తి చేయడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని వివరించారు. కార్యక్రమాల్లో తొండమనాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. కృష్ణయ్య, భాస్కర్‌పేట మునిసిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానప్ప, బాబుగ్రహారం మునిసిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీదేవి, స్కౌట్ మాస్టర్ జయసింహ పాల్గొని విద్యార్థులకు స్కౌటింగ్ సేవల ప్రాధాన్యాన్ని వివరించారు. గైడ్ కెప్టెన్లు పి. పద్మావతి, పావని, యోగానందం, వెంకటాద్రి, మురళి, నాగజ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.