Saturday, 15 August 2026
  • Home  
  • శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు

ఉదయగిరి: శ్రావణ మాసం సందర్భంగా ఉదయగిరి మండలంలోని దేవతామూర్తుల ఆలయాల్లో శ్రావణ మొదటి శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని అమ్మవారికి చీర, పసుపు, కుంకుమలు సమర్పించి అర్చనలు చేయించుకున్నారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గండిపాలెం గంగమ్మతల్లి ఆలయంతో పాటు ఉదయగిరిలోని సంతానలక్ష్మి అమ్మవారి ఆలయంలోనూ విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణాలు భక్తుల రాకతో సందడిగా మారాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.