పున్నమి న్యూస్ డి హరికృష్ణ జులై 22 చిట్టమూరు మండలం,
మండలానికి అతి సమీపంలో ఉన్న కోగీలి లోని రక్షిత మంచినీటి ట్యాంకి శిధిలావ్యవస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్యాంకుకు పలుచోట్ల పగుళ్లు ఏర్పడటంతో పాటు నిర్మాణం బలహీన పడుతుందని స్థానికులు చెబుతున్నారు.
దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందనే భయం నెలకొంది.
ఈ ట్యాంకు ద్వారా గ్రామానికి తాగునీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే ట్యాంకును పరిశీలించి, దాని భద్రతపై నివేదిక సిద్ధం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అవసరమైతే ట్యాంకు మరమ్మతులు చేపట్టడం లేదా కొత్త రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.



