రామచంద్రాపురం ఆగస్టు 08 (పున్నమి ప్రతినిధి)
మండలంలోని రాయల్ చెరువు కట్ట సమీపంలో వెలసియున్న శ్రీ శక్తి పీఠంలో శనివారం శాస్రోక్తంగా ధర్మ రక్షణ యజ్ఞం ప్రారంభమైంది కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి ఆధ్వర్యంలో స్థానిక పీఠాధీశ్వరి శ్రీ రమ్యానంద భారతి మహాస్వామిని ధర్మ పరిరక్షణ యజ్ఞాన్నిఅత్యంత వైభవపేతంగా నూట ఎనిమిది రకాల సుకంద ద్రవ్యాలతో యజ్ఞ హోమం నిర్వహించారు వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ అత్యంత భక్తిశ్రద్ధలతో చేపట్టారు ఈ యజ్ఞ హోమంలో స్వయంగా భక్తులు పాల్గొనే అవకాశాన్ని కల్పించారు ఈ కార్యక్రమంలో శ్రీ శక్తి పీఠం కార్యనిర్వాహక కార్యదర్శి చంద్రశేఖర్, పరిపాలన అధికారి శ్రీకాంత్, కార్యనిర్వహణ అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు



