126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దుమ్ నగర్ లో మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించగా ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్యే ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. ప్రవక్త మహమ్మద్ (స) బోధించిన శాంతి, సహనం, పరస్పర గౌరవం, పేదల పట్ల దయ, మానవ సేవ వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా జగద్గిరిగుట్ట డివిజన్‌లోని ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు.
“ప్రేమ, శాంతి, కరుణ – ప్రవక్త మహమ్మద్ (స) చూపిన మానవతా మార్గం” అనే సందేశంతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, శ్రీ వెంకటేశ్వరా దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, డివిజన్ మైనారిటీ అధ్యక్షులు ఎండి. ఆజం, సీనియర్ నాయకులు సయ్యద్ సాజిద్, పాషా, ఖయ్యుమ్, మహమ్మద్ మెహెమూడ్, మహమ్మద్ అన్వర్, మహమ్మద్ ఇబ్రహీం, మహమ్మద్ సోహెల్, ఎస్.కె. జావీద్, మహమ్మద్ ఖదీర్, మహమ్మద్ అక్బర్, సయ్యద్ జలీల్, సురేష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.


