సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎస్ఐ వినోద్‌కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ తులసి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు.
ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిని ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఇందు, 9వ తరగతి విద్యార్థిని పి.నందిని దక్కించుకున్నారు. రెండో బహుమతి 8వ తరగతి కె.అశ్విత, 10వ తరగతి ఎం.తేజశ్రీలకు, మూడో బహుమతి 8వ తరగతి లక్ష్మీప్రసన్న, సీనియర్ ఎంపీసీ విద్యార్థిని సౌందర్యలకు లభించింది. సర్దార్ పటేల్ దేశ సమైక్యత కోసం చేసిన సేవలను విద్యార్థులు తెలుసుకుని, ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్ఐ వినోద్‌కుమార్ సూచించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

వ్యాసరచనలో మెరిసిన కేజీబీవీ విద్యార్థినులు
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎస్ఐ వినోద్‌కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ తులసి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిని ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఇందు, 9వ తరగతి విద్యార్థిని పి.నందిని దక్కించుకున్నారు. రెండో బహుమతి 8వ తరగతి కె.అశ్విత, 10వ తరగతి ఎం.తేజశ్రీలకు, మూడో బహుమతి 8వ తరగతి లక్ష్మీప్రసన్న, సీనియర్ ఎంపీసీ విద్యార్థిని సౌందర్యలకు లభించింది. సర్దార్ పటేల్ దేశ సమైక్యత కోసం చేసిన సేవలను విద్యార్థులు తెలుసుకుని, ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్ఐ వినోద్‌కుమార్ సూచించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

