Tuesday, 22 September 2026
  • Home  
  • వైఎస్సార్‌ వర్ధంతి-ఇడుపులపాయలో నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు
- తిరుపతి

వైఎస్సార్‌ వర్ధంతి-ఇడుపులపాయలో నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్ ఘాట్ ఇడుపులపాయ వద్ద తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, జిల్లా ముఖ్య నేతలు బుధవారం ఘనంగా అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన ప్రజాబంధువుగా ప్రజల మనసులు గెలిచిన గొప్ప నాయకుడని కొనియాడారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా అహర్నిశలు పనిచేసిన మహనీయుడని గుర్తుచేసుకున్నారు. అటు తర్వాత తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. జలయజ్ఞం పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగాన్ని ఆధునీకరించి రైతుల ఆపద్బాంధవుడిగా వైఎస్సార్ నిలిచారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు చేర్చి వారి పాలిట సంజీవనిగా మారారని, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన సుదీర్ఘ పాదయాత్రతో పార్టీని అధికారంలోకి తెచ్చిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు కాంగ్రెస్ శ్రేణులు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నివాళుల కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, మహిళా నాయకురాళ్లు, మరియు శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.