ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) ద్వారా ఏటీఎం కార్డు లేకుండానే ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి బయోమెట్రిక్ ధ్రువీకరణతో నగదు తీసుకోవచ్చు. పోస్టాఫీసులు, బ్యాంకింగ్ ఏజెంట్లు, అధీకృత సేవా కేంద్రాలతోపాటు ఐపీపీబీ ద్వారా ఇంటి వద్దే ఈ సేవలు పొందొచ్చు. అయితే వేలిముద్ర వేసే ముందు స్కానింగ్ పరికరంపై అనుమానాస్పద స్టిక్కర్లు, ఫిల్మ్ వంటివి ఉన్నాయా అని పరిశీలించాలి. లావాదేవీ నిర్వహిస్తున్న ఏజెంట్ గుర్తింపు వివరాలు తెలుసుకోవాలి. లావాదేవీ పూర్తయ్యాక స్లిప్ తీసుకుని ఖాతా నుంచి తగ్గిన మొత్తాన్ని తనిఖీ చేయాలి. ‘ఫెయిల్’ అని చెబితే వెంటనే మరోసారి వేలిముద్ర వేయకూడదు.

వేలిముద్రతో డబ్బులు తీస్తున్నారా?