Tuesday, 11 August 2026
  • Home  
  • వేగానికి కళ్లెం ఎక్కడ..? ఏటికొప్పాక ప్రధాన రహదారిపై ప్రమాదాల భయం
- అనకాపల్లి

వేగానికి కళ్లెం ఎక్కడ..? ఏటికొప్పాక ప్రధాన రహదారిపై ప్రమాదాల భయం

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 10 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలోని ప్రధాన రహదారిపై వాహనాలు అతివేగంగా దూసుకెళ్తుండటంతో ప్రజలు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రహదారిపై అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, ఇళ్లకు సమీపంలోనే ప్రధాన రహదారి ఉండటం, ప్రమాదకర మలుపులు అధికంగా ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు రహదారి దాటే సమయంలో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలకు ముందే మేల్కొని అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ సూచికలు ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు, ప్రజలు అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే రహదారిని పరిశీలించి భద్రతా చర్యలు చేపట్టి, విద్యార్థులు మరియు గ్రామస్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 10 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామంలోని ప్రధాన రహదారిపై వాహనాలు అతివేగంగా దూసుకెళ్తుండటంతో ప్రజలు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రహదారిపై అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, ఇళ్లకు సమీపంలోనే ప్రధాన రహదారి ఉండటం, ప్రమాదకర మలుపులు అధికంగా ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు రహదారి దాటే సమయంలో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాలకు ముందే మేల్కొని అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ సూచికలు ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు, ప్రజలు అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే రహదారిని పరిశీలించి భద్రతా చర్యలు చేపట్టి, విద్యార్థులు మరియు గ్రామస్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.