విజయనగరం, అక్టోబర్ 1:
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో గురువారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవన రాణి మాట్లాడుతూ, అక్టోబర్ నెల మొత్తం జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీలలో వృద్ధులకు ప్రత్యేక వైద్య శిబిరాలు, ఎన్సీడీ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
అసంక్రమిత వ్యాధుల అధికారి డాక్టర్ వీఎస్కే రఘువంశి మాట్లాడుతూ వృద్ధుల్లో బీపీ, షుగర్, మానసిక సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. మానసిక సమస్యల కోసం టెలి-మానస్ 14416కు కాల్ చేయాలని తెలిపారు.
ద్వారపూడి గ్రామంలోని మహాత్మా గాంధీ వృద్ధుల అనాథ ఆశ్రమంలో వృద్ధులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అనంతరం అరటిపండ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.


