Tuesday, 11 August 2026
  • Home  
  • విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సహకరించండి…. వరంగల్ ఎంపీ కడియం కావ్యకు రిటైర్డ్ ఉద్యోగుల వినతి
- News

విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సహకరించండి…. వరంగల్ ఎంపీ కడియం కావ్యకు రిటైర్డ్ ఉద్యోగుల వినతి

తొర్రూరు, ఆగస్ట్ 9 ( పున్నమి ప్రతినిధి ) తొర్రూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ తొర్రూరు మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధి బృందం ఆదివారం వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ను కలిసి వినతిపత్రం అందజేశారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం తొర్రూరు మండల శాఖ అధ్యక్షుడు ఇట్టే సోమారెడ్డి నేతృత్వంలో అసోసియేట్ ప్రెసిడెంట్ మన్నూరు కోటయ్య, దీకొండ వీరభద్రం, ఆర్థిక కార్యదర్శి బోడ బాలాజీ, గట్టు సోమయ్య తదితరుల ప్రతినిధి బృందం వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్యను ఆమె క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకం కలిసి తమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. తొర్రూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగుల సౌకర్యం కోసం వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సబ్ ట్రెజరీ ఆఫీస్, అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు ఈ వినతిపత్రంలో ఎంపీ ని కోరారు. అలాగే తొర్రూరు డివిజన్ కేంద్రంలో నిర్మించిన తమ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం అభివృద్ధి పనుల కోసం కూడా సహకరించాలని వారు ఎంపీ కడియం కావ్యను అభ్యర్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.