12/07/2026
ఈ రోజు (ఆదివారం) ఉదయం సుమారు 5:08 గంటలకు విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. INCOIS నివేదిక ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. కాకినాడ తీరానికి సుమారు 225 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసిస్తూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని సూచించారు.

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు
12/07/2026 ఈ రోజు (ఆదివారం) ఉదయం సుమారు 5:08 గంటలకు విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. INCOIS నివేదిక ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. కాకినాడ తీరానికి సుమారు 225 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసిస్తూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని సూచించారు.

