Monday, 14 September 2026
  • Home  
  • విశాఖలో ఏఐజీ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి: లోకేష్ శంకుస్థాపన
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

విశాఖలో ఏఐజీ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి: లోకేష్ శంకుస్థాపన

విశాఖపట్నం ఎండాడలో ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ (AIG) ఆసుపత్రి నిర్మాణానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రూ.2,000 కోట్ల పెట్టుబడితో 9 ఎకరాల్లో వెయ్యి పడకల సామర్థ్యంతో రూపుదిద్దుకోనున్న ఈ క్యాంపస్ ద్వారా 9,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇందులో 50కి పైగా వైద్య విభాగాలు, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాల, రీసెర్చ్ ల్యాబ్, రోజుకు 5,000 మందికి ఓపీడీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో 650 పడకలను 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నారు. ఈ ఆసుపత్రి ఏర్పాటుతో ఏపీ వాసులకు హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండానే ప్రపంచస్థాయి వైద్య సేవలు సొంత రాష్ట్రంలోనే అందుతాయి.

విశాఖపట్నం ఎండాడలో ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ (AIG) ఆసుపత్రి నిర్మాణానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రూ.2,000 కోట్ల పెట్టుబడితో 9 ఎకరాల్లో వెయ్యి పడకల సామర్థ్యంతో రూపుదిద్దుకోనున్న ఈ క్యాంపస్ ద్వారా 9,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇందులో 50కి పైగా వైద్య విభాగాలు, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాల, రీసెర్చ్ ల్యాబ్, రోజుకు 5,000 మందికి ఓపీడీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో 650 పడకలను 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నారు.

ఈ ఆసుపత్రి ఏర్పాటుతో ఏపీ వాసులకు హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండానే ప్రపంచస్థాయి వైద్య సేవలు సొంత రాష్ట్రంలోనే అందుతాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.