వినాయక చవితి సందర్భంగా సోమవారం పీజీఆర్‌ఎస్ రద్దు*
*క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల స్వీకరణ*
విజయనగరం, జిల్లా బ్యూరో /రమణ, సెప్టెంబరు 13: పున్నమే ప్రతినిధి
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు (సెప్టెంబరు 14) ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు.
అయితే ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకోసం పీజీఆర్‌ఎస్‌కు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.



