తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విదేశీ పౌరసత్వం పొందిన భారతీయ మూలాల వ్యక్తులు ఓటు హక్కు వినియోగించిన ఘటనలపై దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇప్పటివరకు సుమారు 40 కేసులను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఎన్నికల సంఘంతో కలిసి పూర్తి వివరాలు సేకరిస్తున్నాయి. ఎన్నికల ముందు భారత్‌కు వచ్చి ఓటు వేసి వెంటనే విదేశాలకు వెళ్లిన వారి ప్రయాణ వివరాలను పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో తాము ప్రత్యేకంగా ఓటు వేయడానికి వచ్చామని వెల్లడించిన వారి పోస్టులను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. విదేశీ పౌరులు ఓటు వేసినట్లు తేలితే ప్రజాప్రతినిధుల చట్టం కింద చర్యలు తీసుకోవడంతో పాటు వారి ఓసీఐ కార్డులను రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారం ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై చర్చకు దారితీసింది.

విదేశీ పౌరసత్వం పొందిన ఓటర్లపై దర్యాప్తు ముమ్మరం