తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విదేశీ పౌరసత్వం పొందిన భారతీయ మూలాల వ్యక్తులు ఓటు హక్కును వినియోగించిన ఘటనలపై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే దాదాపు 40 కేసులను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఎన్నికల సంఘంతో కలిసి వివరాలు సేకరిస్తున్నాయి. ఎన్నికల ముందు తమిళనాడుకు వచ్చి ఓటు వేసిన అనంతరం తిరిగి విదేశాలకు వెళ్లిన వారి ప్రయాణ వివరాలను పరిశీలిస్తున్నారు. కొందరు త సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఓటు వేయడానికి ప్రత్యేకంగా వచ్చామని పేర్కొనడంతో అధికారులు వాటిని కూడా పరిశీలిస్తున్నారు. విదేశీ పౌరులు ఓటు వేసినట్లు తేలితే ప్రజాప్రతినిధుల చట్టం కింద చర్యలు తీసుకోవడంతో పాటు వారి ఓసీఐ కార్డులను కూడా రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారం ఎన్నికల నిర్వహణపై కీలక చర్చకు దారితీసింది.

విదేశాల నుంచి వచ్చి ఓటేసిన వారిపై దర్యాప్తు ముమ్మరం