వార్డు నెంబర్ 21లో నోటీసులపై ఎమ్మార్వో వివరణ
నిర్మల్: నిర్మల్ అర్బన్ పరిధిలోని వార్డు నెంబర్ 21లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా జారీ చేస్తున్న నోటీసులపై ఎమ్మార్వో రాజు గారు. ప్రజలకు వివరణ ఇచ్చారు. నోటీసులకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని, నోటీసులు అందుకున్న వారు నిర్దేశిత ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
నోటీసులు అందుకున్న వారికి 10 రోజుల వరకు వాటిని స్వీకరించి, అవసరమైన వివరాలు సమర్పించుకునే అవకాశం ఉంటుందని ఎమ్మార్వో రాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయబ్ తాసిల్దార్ శేఖర్. వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ షేక్, బీఎల్ఏలు నదీమ్ షేక్, ఇఫ్తాకర్ అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


