వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన సర్పంచ్ ప్రసాద్ గౌడ్
వెల్దండ జూన్ 05 *: వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ ఈదమ్మబండ తండాలో నిర్వహకుడు కొర్ర శివ నాయక్ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, మాజీ ఎంపిటిసి చల్ల వెంకట్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్, గ్రామ ప్రజలకు క్వాలిటీ వాటర్ అందించాలని ఆయన సూచించారు. అనంతరం వాటర్ ప్లాంట్ నిర్వాహకుడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చొప్పరి రామకృష్ణ, సీనియర్ నాయకులు కాసోజు బ్రహ్మచారి, ఆలంపల్లి కృష్ణ, మోత్య నాయక్, లోక్య, అంజ్య నాయక్, యువ నాయకులు వెంకట్రావు, మహేందర్ నాయక్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.



