నెల్లూరు జిల్లాలో కొంతకాలంగా నెలకొన్న నీటి కొరతకు ఉపశమనం లభిస్తోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటగా, సోమశిల జలాశయంలోనూ నీటిమట్టం క్రమంగా పడిపోయింది. దీంతో సాగు, తాగునీటి అవసరాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో ఈ నెల 19 నుంచి సోమశిలకు వరద ప్రవాహం ప్రారంభమైంది. గతంలో 15.287 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ ప్రస్తుతం 19 టీఎంసీలకు చేరువైంది. సోమవారం ఉదయం జలాశయానికి 3,684 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి నిల్వ పెరుగుతుండటంతో జిల్లా ప్రజలకు కొంత ఊరట లభించింది. సాగు, తాగునీటి అవసరాలకు ఈ నీటి నిల్వలు భరోసా కల్పిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
Uploaded Video:

