పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ ✍
లాక్ డోన్ సమయంలో నెల్లూరు నగరంలో రోడ్లపైకి వచ్చిన పలు బైకులు ఆటోలు ఇతర వాహనాలు సీజ్ చేయడం జరిగింది. అయితే నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విన్నపం మేరకు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ సీజ్ చేసిన వాహనాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. కఠిన కేసులు కాకుండా నామమాత్రం చలానాలతో విడుదల చేయాలని సూచించారు.